calender_icon.png 26 December, 2025 | 6:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ అభివృద్ధిలో వాజ్‌పేయి సేవలు చిరస్మరణీయం

26-12-2025 12:54:30 AM

పీర్జాదిగూడ సర్కిల్ బీజేపీ అధ్యక్షుడు, రాంపల్లి యాదగిరిగౌడ్

మేడిపల్లి, డిసెంబర్ 25 (విజయక్రాంతి); గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లోని పీర్జాదిగూడ సర్కిల్ బిజెపి అధ్యక్షులు రాంపల్లి యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో ఉపాధ్యక్షులు తుపాకుల గోపాల్ అధ్యక్షతన భారతరత్న మాజీ ప్రధా ని అటల్ బిహారి వాజ్పేయి జయంతి వేడుకలను ఉప్పల్ డిపో మల్లికార్జున నగర్ కాలనీ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి నేతలు వాజ్పేయి చిత్రపటా నికి పుష్పాంజలి ఘటించి భారతదేశ అభివృద్ధికి, బడుగు బలహీన వర్గాల ఉన్నతికి ఆయన చేసిన సంస్కరణలను సేవలను స్మరించుకున్నారు.

ప్రతి భారతీయునికి వాజ్పాయ్ జీవితం స్ఫూర్తిదాయకమని, నేటి యువత, ఆయనను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాల ని అన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన దాతలను ఘనంగా సన్మానించి జ్ఞాపికలను బహుకరించారు. రక్తదానం మరొక రికి ప్రాణదానమని రక్త దానం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నల్ల భాస్క ర్ రెడ్డి, రాష్ట్ర మహిళా మోర్ఛ ఉపాధ్యక్షురాలు కంజుల సుగుణరెడ్డి, రాష్ట్ర నాయకు రాలు సుజాత నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి గోనే శ్రీనివాస్, బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామల పవన్ రెడ్డి, రామోజీ, ప్రధాన కార్యదర్శులు మల్లెల సంతోష్, కొండ కింది వాసుదేవ రెడ్డి, అనిల్ రెడ్డి, ఏమైనా దాసు, శివ, వినయ్, బాలరాజు, నాగప్ప, శ్రీకాంత్, పలువురు బోడు ప్పల్ బిజెపి నేతలు దాసరి మహేష్ ఏనుగుల లక్ష్మయ్య, తుప్పత్ ఆనంద్, బిజెపి కార్య కర్తలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.