20-05-2025 12:55:59 AM
కోయకుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని 23 గ్రామాల గొత్తి కోయలు ఆందోళన
చర్ల, మే 19 (విజయ క్రాంతి): వలస ఆదివాసీలుగా పేరు గాంచిన గొత్తి కోయలు గత నలభై ఏళ్లుగా చర్ల మండలంలో గల అటవీ ప్రాంతాలలో జీవనం కొనసాగిస్తూ తమ పిల్లల చదువులకై, సంక్షేమ పథకాల అమలుకు కుల ధ్రువీకరణ పత్రాలను ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ సోమవారం తాసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు.
మండల పరిధిలోని ఇరవై మూడు గ్రాముల నుండి వందల సంఖ్యలో ఆదివాసి గొత్తి కోయలు కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. తమకు కోయ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని, కోర్టు ఆదేశాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. తొలుత మండల కేంద్రంలో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భారీ ప్రదర్శన నిర్వహించారు. అక్రమంగా జారీ అవుతున్న కుల ధ్రువ పత్రాల జారిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
డబ్బులు ఇస్తేనే కుల ద్రవపత్రాలు ఇస్తామంటే తాము డబ్బులు ఇస్తామంటూ బీస్మించారు. న్యాయంగా తమకు ఇవ్వాల్సిన కోయ ధ్రువీకరణ పత్రాలను ఇవ్వాలన్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడికి ఎస్‌ఐ కేశవ్ చేరుకొని గొత్తి కోయలతో చర్చించారు. బహుజన్ సమాజ్ పార్టీ డివిజన్ అధ్యక్షులు కొండ చరణ్, ,కొండ కౌశిక్ గొత్తి కోయల ఆందోళనకు మద్దతు పలికారు.
తమకు వేరే గ్రామానికి ఇచ్చినట్టు పత్రాలు జారీ చేయాలని బైఠాయించి తాహసిల్దార్ సమాధానం ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. స్పందించిన తహ సిల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ నిబంధనలను విరుద్ధంగా ఇచ్చిన కుల దృవపత్రాలను విచారణ చేసి రద్దు చేస్తామని, గొత్తి కోయల కుల ధ్రువీకరణ పత్రాల జారిపై జిల్లా కలెక్టర్ తో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
దీంతో గొత్తి కోయలు ఆందోళన విరమించారు.ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సామల ప్రవీణ్ చర్ల మండల ఆదివాసి గ్రామ పెద్దలు ,మడకం చందు, జోగయ్య ,రామయ్య, అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.