20-05-2025 12:54:45 AM
కరీంనగర్ క్రైం, మే 19 (విజయ క్రాంతి): అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో చేపడుతున్న హనుమాన్ మాలదారుల బిక్ష సోమవారం 19వ రోజుకు చేరింది. కరీంనగరంలోని కురమవాడ బాల భక్తాంజనేయ ఆలయంలో ప్రతిరోజూ స్వాములకు బోజన వసతి కల్పిస్తున్నారు.
మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి ప్రతిరోజూ కూరగాయల దాతగా వ్యవహరిస్తుండగా.. ఎలుక పెళ్లి శివశంకర్- సుష్మ దంపతులు, వారి కుమారులు మల్లికార్జున్-రాధాకృష్ణ దంపతులు అన్నదాతలుగా వ్యవహరించారు. వీరాంజనేయ టెంట్ హౌస్ యజమాని దయ్యాల సంజీవ్ టెంట్ తోపాటు సామాగ్రి ఉచితంగా అందించారు.
అలాగే కృష్ణ మినరల్స్ వాటర్ ప్లాంట్ యజమానులు తోట కృష్ణవేణి-మల్లేశం మొదటి రోజు నుండి మంచినీటి దాతగా వ్యవహరిస్తున్నారు. దాతలందరిపై కొండగట్టు అంజనేయ స్వామి కృప కటక్షాలు ఉండాలని... డి సంపత్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డి సంపత్ తోపాటు దయ్యాల సంజీవ్, గట్టయ్య, జాతర కొండ శ్రీను, అశోక్, వి శ్రీనివాస్, ఆలయ అర్చకులు చింతల రమేష్, భూమ్ రావు, దయ్యాల లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.