calender_icon.png 19 November, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులాంతర వివాహాలకు రక్షణ చట్టం తేవాలి

19-11-2025 12:57:18 AM

వనస్థలిపురంలో సీపీఎం నాయకుల ఆందోళన

ఎల్బీనగర్, నవంబర్ 18 : కులాంతర, మతాంతర వివాహాలకు రక్షణ కల్పించడానికి తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రక్షణ చట్టం తేవాలని సీపీఎం నాయకుడు ఆలేటి ఎల్లయ్య డిమాం డ్ చేశారు.  రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరుక్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు ఎర్ర చంద్రశేఖర్ ప్రేమ వివాహం చేసుకున్నాడని అతని సోదరుడు ఎర్ర రాజశేఖర్‌ను కిడ్నాప్ చేసి హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన వధువు తండ్రి కావలి వెంకటేష్ పాత్రధారులు సూత్రధారులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

వనస్థలిపురం రైతు బజార్ దగ్గర  మంగళవారం సీపీఎం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. చంద్రశేఖర్ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా  చెల్లించాలని,  కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో  సీపీఎం నాయకులు భూష రాజు కాశయ్య,  మన్యం రాధమ్మ. అభిమాన గంగమ్మ, భారతమ్మ, వరలక్ష్మి, జయమ్మ, లక్ష్మణ్ నాయక్  తదితరులు పాల్గొన్నారు.