calender_icon.png 19 November, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనురాగ్ యూనివర్సిటీలో జాతీయ ఫార్మసీ వారోత్సవాలు ప్రారంభం

19-11-2025 12:58:08 AM

ఘట్ కేసర్, నవంబర్ 18 (విజయక్రాంతి) : వెంకటాపూర్ లోని అనురాగ్ విశ్వవిద్యాలయం ఫార్మసీ విభాగం, ఎన్‌ఎస్‌ఎస్ సెల్ యూనిట్ 1, స్వస్థ్య క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ ఫార్మసీ వారోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. డీన్ స్కూల్ అఫ్ ఫార్మసీ డాక్టర్ వసుధా భక్షి, గౌరవ అతిథి యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ నుండి విచ్చేసిన డాక్టర్ హెప్జిబా శామ్యూల్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

డా. హెప్జిబా శామ్యూల్ మీ గ్లోబల్ హెల్త్ కెరీర్ను అన్లాక్ చేయండి అనే అంశంపై ముఖ్యమైన విలువైన వృత్తిపరమైన మార్గదర్శక ఉపన్యాసం ఇచ్చారు. ప్రారంభ దినోత్సవం సందర్భంగా రక్త వర్గ నిర్ధారణ శిబిరం  నిర్వహించారు. తమ రక్త వర్గాలను తెలుసుకోవడానికి 200 మందికి పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ జె. రాజేంద్ర కుమార్ ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ 1 ప్రోగ్రామ్ ఆఫీసర్, బి. తిరుపతి ఫార్మసీ విభాగం కోఆర్డినేటర్, నేషనల్ ఫార్మసీ వీక్ ఫ్యాకల్టీ కో-ఆర్డినేటర్లు డాక్టర్  ఫర్హానా, డాక్టర్ సంతోషి విజయవంతంగా నిర్వహించారు.