27-01-2026 12:25:08 AM
టీఆర్పీ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు
జయశంకర్ భూపాలపల్లి, జనవరి 26: తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ) భూ పాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో సోమవారం 77వ గణతంత్ర దినో త్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్పీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు.
ఈ రాజ్యాంగం వల్లే దేశ ప్రజలు గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నారని అన్నారు. టీఆర్పీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కి, రాజ్యాంగ నిర్మాణ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాజ్యాంగం అమలైన ఈ పుణ్యదినాన్ని పండుగ వాతావరణంలో జరుపుకోవడం గర్వకారణమ న్నారు.
ఈ సందర్భంగా ప్రజలకు గణతం త్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్పీ నాయకులు ఇనుగాల ప్ర ణయ్ రాజ్, సామల శ్రీలత రాజు, ఎస్బీఐ అనంతల సంపత్ (బొట్టు), అశోక్ మడే, సం తోష్ ముక్తేశ్వర్, రొడ్డ శ్రీను, జింకల శ్రీను, మామిడి శ్రీకాంత్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు