27-01-2026 12:25:53 AM
అడవి తల్లుల ఆరాధన కేంద్రం
ముస్తాబైన సమ్మక్క, సారలమ్మ గద్దెలు
నంగునూరు, జనవరి 26: అడవి తల్లుల ఆరాధనకు వేళాయే.. నిలువెత్తు బంగారం (బెల్లం)తో మొక్కులు చెల్లించుకునే భక్తజన సందోహానికి వేదిక సిద్ధమైంది. సిద్దిపేట జి ల్లా నంగునూరు మండలంలోని అక్కెనపల్లి గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది. మేడారం వెళ్లలేని భక్తుల పాలిట ‘మి నీ మేడారం’గా ప్రసిద్ధి చెందిన అక్కెనపల్లి సమ్మక్క-సారలమ్మ జాతర ఈ నెల 28న ప్రారంభమై 31న ముగుస్తుందని నిర్వహకు లు తెలిపారు.గత 32 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ జాతర,సిద్దిపేట తో పాటు ఇతర జిల్లాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు.
కొలువుదీరారు ఇలా....
1994లో గ్రామానికి సమీపంలోని పులిగుండ్ల ప్రాంతంలో ఒక గొర్రెల కాపరి గొర్రెలను మేపుతుండగా, అక్కడ పసుపు ము ద్దలు, కుంకుమ ప్రత్యక్షమయ్యాయని స్థానికులు చెబుతారు.మేడారంలో జాతర జరిగే సమయంలోనే ఈ ఘటన జరగడం,సమ్మక్క-సారలమ్మలు పులిపై స్వారీ చేస్తారనే ఇక్క డి ప్రజల నమ్మకం. ఆ తల్లులే ఇక్కడ కొలువయ్యారని భక్తులు చెప్పుకుంటారు. నాటి నుంచి ప్రతి రెండేళ్లకోసారి ఇక్కడ జాతరను ఘనంగా నిర్వహిస్తున్నారు. సుమారు 14 ఎ కరాల విస్తీర్ణంలో జాతర ఉత్సవాలు జరగనున్నాయి.
ఏర్పాట్లు పూర్తి
అక్కినపల్లి సమ్మక్క-సారలమ్మ జాతర జిల్లాలోనే ఎంతో గుర్తింపు పొందిందని సర్పంచ్ రేణుకరమేష్ తెలిపారు.ముక్కోటి దేవతల సాక్షిగా వెలిసిన ఈ తల్లుల జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామ పంచాయతీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని కోరారు.