27-01-2026 12:24:30 AM
- అన్నం పెడుతున్నారా, ఆసుపత్రి సౌలత్‌లు బాగున్నాయా..?
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట, జనవరి 26 (విజయక్రాంతి): సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. జిల్లా కాన్సర్ ఆసుపత్రిని ఐసియులో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో నేను అన్నం పెట్టిస్తున్న రోజు పెడుతున్నారా, సౌలత్ లు మంచిగున్నాయా అని రోగులతో ముచ్చటించారు. మందులు బయటకు రాయొద్దని, ఆసుపత్రి లో అందుబాటులో ఉంచాలన్నారు.
ఐసియులో గత ప్రభుత్వంలోనే ఒక్కో మిషన్ కి రూ.12 లక్షలు విలువైన పరికరాలు ఏర్పాటు చేశామని అవి ఉపయోగంలో ఉన్నాయా లెవా అని, ఒక్కో పెషేంట్ కు రోజుకి రూ.50వేలు ఖర్చు లేకుండా ఏర్పాటు చేశామని గుర్తు చేసారు. క్యాన్సర్ ఆసుపత్రి లో మెరుగైన సేవలు అందించాలని, అందులో పని చేసే ఉద్యోగులకు 3నెలలుగా జీతాలు రావడం లేదన్నారు. జిల్లా వైద్య అధికారితో మాట్లాడి వేంటనే వారి జీతాలు చెల్లించాలని చెప్పారు. ఆసుపత్రి లో ఆత్మీయంగా మాట్లాడటంతో రోగులు సంతోషం వ్యక్తం చేశారు.