25-07-2025 12:59:07 AM
ఆదిలాబాద్, జూలై 24 (విజయక్రాంతి ) : ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్ర వాసి దుర్మరణం చెందారు. స్థానికుల కథనం ప్రకారం... గురువారం మహా రాష్ట్రలోని కిన్వట్ తాలూకా బొదిడి గ్రామానికి చెందిన భానుదాస్, బాబు గిత్తేలు ద్విచ క్ర వాహనంపై గుడిహత్నూర్‌కు వస్తుండగా వారు ప్రయాణిస్తూన్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బానుదా స్ (60) అక్కడికక్కడే మృతి చెందగా, బాబు గిత్తేకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు108 అంబులెన్స్‌లో క్షతగాత్రుడిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.