calender_icon.png 27 July, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

25-07-2025 01:00:36 AM

కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, జూలై 24 (విజయక్రాంతి): జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం లో నదులు, వాగుల పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రజల కు సూచించారు.

ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు సంబంధిత శాఖల అధికారులు 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండి తక్షణ పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. భారీ వర్షాల వలన ఎక్కడైనా ప్రమాదం ఎదురైతే లేదా సాయం అవసరమైతే, నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్ 91005 77132ను వెంటనే సంప్రదించాలని ప్రజల కు ఈ సందర్భంగా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.