25-07-2025 12:57:40 AM
నిర్మల్, జూలై 24 (విజయక్రాంతి): అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు రోడ్లపైన చెత్త వేసిన వారికి మున్సిపల్ అధికారులు జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ .. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని.. ఇకపై రోడ్లపై చెత్త వేస్తే భారీ జరిమానాలు విధించడం జరుగుతుందన్నారు.
వ్యాపారస్తులం దరూ రోడ్లపై చెత్త వేయకుండా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆయన కోరారు. అలాగే రోడ్లపై ఉన్న వ్యాపార సముదాయాలను తొలగించాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ సుభాష్ , టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ సాయి కిరణ్, శానిటరీ ఇన్స్పెక్టర్లు దేవదాస్, ప్రవీణ్ కుమార్,మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.