26-09-2025 12:00:00 AM
అశ్వారావుపేట, సెప్టెంబరు 25, (విజయక్రాంతి ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం లోని రహదారులు అక్రమ గంజాయి రవాణా, అక్రమ మార్గంలో సొమ్ములు సంపాదించేందుకు యువకులు గంజాయి రవాణా, మత్తుకోసం పరుగులు పెడుతున్నారు.
అశ్వారావుపేట నియోజకవర్గం లో కొద్ది నెలల క్రితం చం డ్రుగొండకు చెందిన ఇద్దరు వ్యక్తు లు జిల్లాలోని ఏడూళ్ల బయ్యారంలో ఛత్తీస్ గఢ్ రా ష్ట్రం నుండి భారీ ఎత్తున వాహనాలలో గం జాయిని స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. అలా గే అశ్వారావుపేట మండలంలోని అనుపాకకు చెందిన ఓ వ్యక్తి చత్తీస్ గడ్ రాష్ట్రంలోని మల్కజ్గర్ లో పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇంకా అనేక మంది ఇతర ప్రాంతాల వ్యాపారులతో కలసి భారీగానే లావాదేవీలు సాగిస్తున్నారు.. మారు మూల గ్రామాల్లోనూ, గంజాయి అమ్మకా లు బాగా పెరిగిపోయాయి. అశ్వారావుపేట, భద్రాచలం తదితర ప్రాంతాల మీదుగా ఛత్తీస్ ఘడ్, ఒడిసా, విశాఖపట్టణం, నర్సప ట్నం, ఏజెన్సీ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున గంజాయి ని వాహనాల్లో సరుకులు, కూరగాయలు తదితర వస్తువుల మాటున దాచి హైదరాబాద్, ముంబయి, చెన్నైతో పాటు పలు రాష్ట్రాలకు యధేచ్చగా తరలించుకు పో తున్నారు.ఇటీవల కాలంలో కొత్తగూడెం, పాల్వంచ.
ఇల్లందు, భద్రాచలం, చర్ల ప్రాం తాలతో పాటు అశ్వారావుపేట నియోజకవర్గంలోని ములకలపల్లి, చండ్రుగొండ, దమ్మ పేట, అశ్వారావుపేట, ప్రాంతాల్లోనూ బారీ గా గంజాయి పట్టుబడింది. ఇక ఆశ్వారావుపేట మండలంలో గత నాలుగైదు సంవ త్సరాల్లో చేక్ పోస్టు వద్ద నారంవారిగూడెం, సత్తుపల్లి, వైపు గంజాయిని తరలిస్తూ వాహనాలు పట్టుబడ్డాయి. గతేడాది కారులో గంజాయి తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డా రు.
అచుతాపురంలో ఓ పామాయిల్ తోట లో రూ.లక్షల విలువైన గంజాలు ప్యాకెట్లు దాచి ఉంచగా, అవి వెలుగులోకి వచ్చాయి. కొద్ది రోజుల క్రితం కూడా దమ్మపేట మం డలం, పట్వారిగూడెం వద్ద రూ.48 లక్షల విలువైన గంజాయినివ్యక్తులను పోలీసులకు పట్టుబడ్డారు. గత జూలైలో గంజాయిని విక్రయించడం, తాగిన కేసులో అశ్వారావుపేట పోలీ సులు 18 మందిని అరెస్ట్ చేశారు .
ములకలపల్లి మండలంలో ఇంట్లో గంజాయిని గుర్తించి కేసు నమోదు చేశారు. చంద్రుగొండ మండలానికి చెందిన ఇద్దరు యువ కులు ఇటీవల ఏడూళ్ల బయ్యారంలో గంజాయితో దొరికడం కలకలం రేపింది. వారిలో ఓ వ్యక్తి గతంలో గంజాయిని తరలిస్తూఛత్తీస్ గఢ్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇలాంటి అనేక సంఘటలు జరగడం కలవరపెడుతోంది. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్ల లు ఎక్కడ పెడదోవ పడతారోనని ఆందోళన చెందుతున్నారు.
ఆందోళన కలిగిస్తున్న వినియోగం..
గంజాయి స్మగ్లింగ్ ఓ ఎత్తయితే ఉమ్మడి జిల్లాలకు చెందిన చాలా మంది ఈ వ్యాపారంలో ప్రవేశిస్తుండటం, కొందరు తాగడా నికి అలవాటు పడుతుండటం ఆందోళన కలిగి స్తోంది. గ్రామీణ ప్రాంతాలకు గంజా యి విస్తరించడం, యువత మత్తులో మునిగి విచ్చలవిడిగా ప్రవర్తించడంతో మరింత ఆం దోళన చెందాల్సిన విషయం. గంజాయి ప ట్టుబడిన సమయంలో వాటిపై కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్న.
అధికారులు వాటి మూ లాల్లోకి వెళ్లి నియంత్రణపై దృష్టిపెట్టడం లేదనే విమర్శలున్నాయి. ప్రభుత్వం ప్రత్యేక బృందాలు ఏర్పాటు, యువతకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడంతో పాటు తల్లి తండ్రులు అప్రమత్తం కాకపోతే భవిష్యత్ అంధకారంగా మారే అవకాశాలున్నాయనే ఆందోళన ప్రజలలో కనిపిస్తుంది.