calender_icon.png 5 October, 2025 | 7:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిమజ్జనంలో తప్పిన ప్రమాదం

05-10-2025 12:41:49 AM

-సరూర్‌నగర్ చెరువు వద్ద పల్టీ కొట్టిన క్రేన్  

-అమ్మవారి విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా ఘటన

ఎల్బీనగర్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): దుర్గామాత విగ్రహాల నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. సరూర్ నగర్ చెరువులో దుర్గామాత విగ్రహాలను నిమజ్జ నం చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం నిమజ్జనం చేస్తుండగా భారీ క్రేన్ పట్టుతప్పి చెరువులో పడిపోయింది. క్రేన్ చెరువులో పడడంతో ప్రమాదం తప్పింది.

రోడ్డు వైపు పడితే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉండేది. అనుభవం లేని సర్వీసెస్కు టెండర్ అప్పగించడంతో సరూర్ నగర్ చెరువు వద్ద క్రేన్ ఫల్టీ కొట్టింది. వినాయక నిమజ్జనంలో కూడా ఇదే కంపెనీకి చెందిన క్రేన్‌కు ప్రమాదం జరిగింది. అనుభవం లేని మెయింటెనెన్స్ కూడా లేని సిటీ క్రేన్ సర్వీసెస్‌కు జీహెచ్‌ఎంసీ అధికారులు కాంట్రాక్ట్ ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.