30-08-2025 12:40:53 AM
వీడియో పుటేజీతో తేటతెల్లం
లాస్‌ఏంజెల్స్, ఆగస్టు 29: భారత్‌కు చెందిన ఓ సిక్కు వ్యక్తి లాస్ ఏంజెల్స్ నగర రోడ్లపై కత్తితో హల్చల్ చేస్తుండగా పోలీసులు షూట్ చేశారు. సదరు సిక్కు వ్యక్తి నడి రోడ్డుపై గట్కా (కత్తితో చేసే సిక్కుల పురాతన యుద్ధ కళ) చేస్తుండగా పోలీసులు హతమార్చారు. జూలైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫుటేజీని పోలీసులు తాజాగా విడుదల చేశారు.
సదరు వ్యక్తి రోడ్డు మీద కత్తితో హల్చల్ చేస్తుండగా.. హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని కాల్చి చంపడం వీడియో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వ్యక్తి పేరు గురుప్రీత్ సింగ్ (35) అని లాస్‌ఏంజెల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. గట్కా అనేది సిక్కుల సాంప్రదాయ యుద్ధ కళ.. వివిధ రకాల ఆయుధాల సాయంతో గట్కా ప్రదర్శిస్తారు.