10-12-2025 01:19:03 AM
తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ
నిజామాబాద్, డిసెంబర్ 9 (విజయ క్రాంతి) : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో మంగళవారం తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని జయజయహే తెలంగాణ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ లలో నూతనంగా నెలకొల్పిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రోడ్లు భవనాల శాఖ కార్యనిర్వాహక అభియంత (ఎస్.ఈ) కె.సర్దార్ సింగ్ ఆవిష్కరించారు.
రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన నమూనాను అనుసరిస్తూ జిల్లాల లో కూడా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఆకట్టుకునే రీతిలో, స్ఫూర్తిదాయకంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం అందరినీ ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.