27-01-2026 12:23:06 AM
రేపటి నుంచి మేడారం మహా జాతర
మహబూబాబాద్,జనవరి 26(విజయక్రాంతి) : మేడారం సమ్మక్క సారలమ్మ మ హా జాతరలో అత్యంత ప్రాధాన్యం కలిగిన మొక్కులలో ఎత్తు బంగారం (బెల్లం) మొక్కు ఒకటి. గిరిజన సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన ఈ ఆచారం జాతర రోజులలో ప్ర త్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కుటుంబ క్షేమం, ఆరోగ్యం, కోరికల నెరవేరుదల కోసం భక్తులు ఈ మొక్కును చెల్లిస్తుంటారు.
కోట్లా ది మంది గిరిజనులు, గిరిజనేతరులు సమ్మ క్క సారలమ్మలను ఇలవేలుపు దేవతలుగా, తమ కులదైవాలుగా భావిస్తారు. తల్లుల కృపతో తమ కోరికలు నెరవేరిన తరువాత కృతజ్ఞతగా బెల్లాన్ని ‘బంగారం’గా భావించి మొక్కుగా సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. భక్తులు ముందుగా జంపన్న వాగులో పుణ్య స్నానం ఆచరించి శుద్ధిగా మొక్కు సిద్ధం చేస్తారు. ఇంటి నుంచి తీసుకొచ్చిన లేదా ఇక్కడ కొనుగోలు చేసిన బెల్లాన్ని, మొక్కు చేసిన వ్యక్తి బరువుకు సమానంగా లేదా నిర్ణయించిన పరిమాణంలో త్రాసులో కొలిచి బెల్లాన్ని సిద్ధం చేస్తారు.
ఈ విధానాన్ని స్థానికంగా ‘ఎత్తు బంగారం’గా పిలుస్తారు. తర్వాత భక్తులు బెల్లాన్ని గుడ్డలో కట్టి లేదా పాత్రలో పెట్టి సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు తీసుకెళ్లి వనదేవతలకు ప్రణమిల్లి మొక్కులు సమర్పించుకొని గిరిజన పూజారుల సమక్షంలో తల్లులకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ సందర్భంగా కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, వడి బి య్యం, కాసులు కూడా సమర్పిస్తా రు.
ఎత్తు బంగా రం మొక్కు చెల్లి స్తే తల్లుల ఆశీస్సులు లభించి కుటుంబంలో శాంతి, సమృద్ధి క లుగుతాయని భక్తుల నమ్మకం. అందుకే చిన్నారుల జననం, అనారోగ్యాల నుం చి కోలుకోవడం, వివాహాలు, ఉపాధి లభించడం వంటి సందర్భాల్లో ఈ మొక్కును చెల్లిస్తుంటారు. జాతర రోజుల్లో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ మొక్కు చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. ఎత్తు బంగారం మొక్కుల కోసం మేడారం జాతరలో ప్రత్యేక ప్రదేశాలను కేటాయించారు. బెల్లం సమర్పణలో ఇబ్బందులు తలెత్తకుండా క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. సం ప్రదాయానికి నిలువెత్తు నిదర్శనమైన మేడారం జాతరలో ఎత్తు బంగా రం మొక్కు గిరిజనుల ఆచారాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలు స్తోంది. ఆధునిక కాలంలోనూ ఈ సంప్రదాయం యథాతథంగా కొనసాగుతుండటం మేడారం జాతర విశిష్టతను చాటు తోంది. సమ్మక్క సారలమ్మల దీవెనల కోసం భక్తులు భక్తిశ్రద్ధలతో ఈ మొక్కును చెల్లిస్తూ జాతరలో పాల్గొంటున్నారు.
ఎదురుకోడి మొక్కు ఎంతో ప్రాధాన్యం
మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరలో ఎదురుకోడి మొక్కుల చెల్లింపు సంప్రదాయ ఆచారాలకు నిలువెత్తు నిదర్శనం. కోట్లాది మంది భక్తుల పాల్గొనే మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరలో గిరిజన సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఎదురుకోడి మొక్కు చెల్లింపు భక్తి శ్రద్ధలతో కొనసాగుతోంది. జాతర సందర్భంగా భక్తులు తమ మొక్కుబడులను తల్లులకు సమర్పిస్తూ ఎదురుకోడిని నైవేద్యంగా సమర్పిస్తున్నారు. ఈ ఆచారం తరతరాలుగా కొనసాగుతున్న గిరిజన సంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగంగా భావిస్తారు.
అడవిదేవతలుగా సమ్మక్క సారలమ్మలను ఆరాధించే గిరిజనులు, గిరిజనేతరులు కుటుంబ క్షేమం, ఆరోగ్యం, పాడిపంటలు, సంతాన ప్రాప్తి వంటి కోరికలు నెరవేరిన తరువాత ఈ మొక్కును చెల్లిస్తారు. జాతర ప్రారంభానికి ముందే మేడారం పరిసర ప్రాంతాల్లో ఎదురుకోడి మొక్కులు చెల్లించే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ప్రత్యేక విధానం ఎదురుకోడి మొక్కును సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తారు.
భక్తులు కోడిని తల్లుల సన్నిధికి ఎదురుగా ఉంచి చల్లగా కాపాడాలని మొక్కుకొని అనంతరం సంప్రదాయ రీతిలో గాలిలోకి ఎగురవేసి మొక్కు చెల్లిస్తారు. సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తున్న మేడారం జాతరలో ఎదురుకోడి మొక్కు చెల్లింపు గిరిజన విశ్వాసాలు, సంప్రదాయాల ప్రతిబింబంగా నిలుస్తోంది.
ఆధునికత పెరుగుతున్నప్పటికీ, ఈ ఆచారం భక్తుల హృదయాల్లో అచంచల విశ్వాసానికి నిదర్శనంగా కొనసాగుతోంది. సమ్మక్క సారలమ్మల దీవెనల కోసం భక్తులు భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లిస్తూ జాతరలో పాల్గొంటున్నారు.