27-01-2026 12:22:36 AM
- ఎగరవేసిన దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి
ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు
సిద్దిపేట, జనవరి 26 (విజయక్రాంతి)/ దుబ్బాక: 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో జాతీయ పతాకాన్ని తలకిందులుగా ఆవిష్కరించడం సిద్దిపేట జిల్లా దుబ్బాక లో సోమవారం జరిగింది. బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి జాతీయ జెండాను తలకిందులుగా ఆవిష్కరించారు. జాతీయ పతాకాన్ని పైకి ఎగరవేస్తుండగా తాడు ఇబ్బంది కలిగించింది.
దాంతో కిందికి లాగి కిందనే ఆవిష్కరించి పతాకాన్ని పైకి పంపించారు అలాంటప్పుడు అయినా కనీసం తాడుని లాగే ముందు చూసుకోక పోవడం ఆయన నిర్లక్ష్యానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. దేశ గౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించిన ఎమ్మెల్యే పై కేసులు నమోదు చేసి శిక్షించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్నారు. దాంతో బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాలకు నచ్చజెప్పారు.