calender_icon.png 13 October, 2025 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్య ఆరోగ్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తప్పదు

13-10-2025 12:50:53 AM

తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్

కామారెడ్డి, అక్టోబర్ 12 (విజయక్రాంతి): వైద్య ఆరోగ్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తప్పదని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నవంబర్ తొమ్మిదిన రాష్ట్ర మహాసభ సంగారెడ్డిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ మహాసభలో జిల్లాలోని ఏఎన్‌ఎంలు ఫార్మసిస్టులు ల్యాబ్ టెక్నీషియన్లు ఆరోగ్య మిత్రలు 14 ఎంప్లాయిస్ ఉద్యోగులు హాజరయ్యారు. 31 మందితో జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు. గౌరవ అధ్యక్షునిగా సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్, యూనియన్ జిల్లా అధ్యక్షురాలు జోష్నా దేవి, జిల్లా కార్యదర్శి అల్లావుద్దీన్ తో పాటు 11 మంది ఆఫీస్ బేరర్స్ ఎంపిక చేశారు. సిఐటియు నాయకులు కొల్లాపురం బాబు, జోష్ణ, సావిత్రి, అల్లావుద్దీన్, స్వామి, గంగాధర్, అన్నపూర్ణ, కవిత, సుజాత, కళ్యాణి, హమీనుద్దీన్, వీరేష్, ప్రభాకర్, దేవలక్ష్మి, వాణి, సుశీల తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ కామారెడ్డి జిల్లా మహాసభ ఈ రోజు పట్టణంలో జరిగింది ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్ హాజరయ్యారు. సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌అధ్యక్షతన  జరిగిన ఈ మహాసభకు జిల్లాలోని ఏఎన్‌ఎంలు, ఫార్మసిస్టులు, ల్యాబ్టెక్నిషన్ లు ఆరోగ్య మిత్రాలు, 104 ఎంప్లాయిస్ హాజరయ్యారు. 31 మందితో జిల్లా కమిటీ వేశారు. 

గౌరవ అధ్యక్షులు గా చంద్రశేఖర్ సిఐటియు, యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి జ్యోత్స్నదేవి జిల్లా కార్యదర్శి అల్లాఉద్దీన్‌లతోపాటు 11 మంది ఆఫీస్ బేరర్స్ ఎన్నిక అయ్యారు.   నవంబర్ 9 న రాష్ట్ర మహాసభ సంగారెడ్డిలో ఉంటుందని ఉద్యోగులందరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 

సిఐటియు నాయకులు కొల్లాపురం బాబు జోత్స్న, సావిత్రి, అల్లాఉద్దీన్, స్వామి , గంగాధర్, అన్నపూర్ణ, కవిత సుజాత కళ్యాణి అమీనుద్దీన్, వీరేష్, ప్రభాకర్, దేవలక్ష్మి, వాణి, సుశీల, శోభ, సంగీత, మాధవి, రాజమణి, రాధిక, సునీత, బాలమణి, ప్రవీణ, శ్రీలత, ఇమ్రాన్, రాథోడ్ నాయక్ శ్రీనివాస్, మల్లికార్జున్, శ్రీనివాస్ పాల్గొన్నారు.