13-10-2025 12:51:25 AM
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు, అక్టోబర్ 12 దేశ వ్యాప్త పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం పటాన్ చెరు పట్టణంలోని జిహెచ్‌ఎంసి కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి విధిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన కోరారు. పోలియో రహిత దేశంగా మార్చడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, వైద్య సిబ్బందిపాల్గొన్నారు.