calender_icon.png 14 September, 2025 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇలాంటి సినిమాతో జీవితాల్లో వెలుగులు

14-09-2025 12:02:35 AM

రాజాకృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం ‘ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు’. సూపర్ రాజా ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరోగా వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ రాజా మాట్లాడుతూ.. “ఎన్నో రోజులు చీకట్లో ఉండి వెలుగు కోసం ప్రయత్నం చేశాను. ఈ ప్రయత్నం ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతుంది” అని చెప్పారు.

హీరోయిన్ చందన పాలంకి మాట్లాడుతూ.. “మొదట సినిమా గురించి చెప్పినప్పుడు ఒకే షాట్‌లో ఎలా తీస్తారు అనే భయం ఉండేది. కానీ, సూపర్ రాజా ఆత్మవిశ్వాసం చూసిన తర్వాత ఆ భయం పోయింది” అని తెలిపింది. మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్, వంశీ గోనె, రమ్యప్రియ, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.