calender_icon.png 14 September, 2025 | 6:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చూస్తే అలా అనిపించడు, కానీ..

14-09-2025 12:04:14 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్‌లో ఉన్నా రు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు నాలుగు సినిమాలను ఒకేసారి లైన్లో పెట్టి వరుసగా షూటింగ్స్ చేస్తున్నాడు. అందు లో ‘రాజాసాబ్’ ఒకటి. నిజానికి ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో చాలా ప్రత్యేకం. ఎందుకంటే ప్రభాస్ తన కెరీర్‌లో ఫస్ట్‌టైమ్ హారర్ అండ్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేస్తున్నారు. అందుకే ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని డిసెంబర్ 5న విడుదలకు సిద్ధమవుతోం ది. ఈ సినిమాను దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్నారు. పీపుల్ మీడి యా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవికపాటు నిధిఅగర్వాల్, రద్దీకుమార్ కూడా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా రానుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

కానీ, మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే ‘రాజాసాబ్’ గురించి, ప్రభాస్ గురించి ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్. ఈ సినిమాలో ఆమె ప్రభాస్ సరసన నటిస్తోంది. ఆ అవకాశం రావడం చాలా ఆనందంగా భావిస్తోందట. ఇంకా ఆమె మాట్లాడుతూ.. ప్రభాస్ చాలా అద్భుతమైన వ్యక్తి. వయసులో ఆయన నాకంటే పెద్దవాడు.

కానీ, ఆయన్ని చూసినప్పుడు అలా అనిపించదు. సైలెంట్‌గా ఉంటారు. ఈ సినిమా కోసం ఆయనతో కలిసి పనిచేయడం మధురంగా అనిపించింది. రాజాసాబ్ సినిమాలో మా ప్రయాణం అందంగా ఉంటుంది. సినిమా కూడా పూర్తయ్యింది. కొన్ని పాటలను చిత్రీకరించాల్సి ఉంది” అంటూ చెప్పుకొచ్చిందీ అమ్మడు. ప్రస్తుతం మాళవిక చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.