calender_icon.png 14 September, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనురాగాల బ్యూటీ

14-09-2025 12:01:23 AM

ఓ మంచి ప్రేమకథ, కుటుంబ విలువలు, తండ్రీకూతుళ్ల అనుబంధాలు కలగలిసిన భావోద్వేగభరితమైన కంటెంట్‌తో వస్తున్న చిత్రం ‘బ్యూటీ’. అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, మారుతీ టీమ్ ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ సంయుక్తంగా నిర్మించాయి. విజయ్‌పాల్‌రెడ్డి అడిదల, ఉమేశ్ కుమార్ భన్సల్ నిర్మాతలు. ‘గీతా సుబ్రమణ్యం’, ‘హలో వరల్డ్’, ‘భలే ఉన్నాడే’ ఫేమ్ జేఎస్‌ఎస్ వర్ధన్ మాటలు, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తించారు.

ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేని ఆర్‌వీ సుబ్రహ్మణ్యం అందించారు.  సెప్టెంబర్ 19న విడుదలవుతున్న ఈ మూవీ ట్రైలర్‌ను హీరో నాగచైతన్య రిలీజ్ చేశారు. ‘ఎప్పుడైనా నేను నిన్ను కొప్పడితే నన్ను అలా వదిలిపెట్టి వెళ్లకు’ అని హీరో.. ‘నిన్ను వదిలేసి వెళ్లడం అంటే.. నా ఊపిరి వదిలేయడమే కన్నా..’ అంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్స్ ప్రారంభమైందీ ట్రైలర్.

హీరోహీరోయిన్ల లవ్‌ట్రాక్, ఫాదర్ డాటర్ ఎమోషన్, మిడిల్ క్లాస్ కష్టాలు.. ఇలా అన్నీ మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. నరేశ్, వాసుకి, నందగోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీగౌడ్, ప్రసాద్ బెహరా ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్; డీవోపీ: శ్రీసాయి కుమార్ దారా; ఎడిటర్: ఎస్‌బీ ఉద్ధవ్; ఆర్ట్: బేబీ సురేశ్ భీమగాని.