calender_icon.png 28 October, 2025 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బహురూప బంగ్లా!

28-10-2025 12:00:00 AM

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ భారత్‌పై మరోసారి విషం చిమ్మారు. భారత్‌లో ‘సెవెన్ సిస్టర్స్’గా పిలుచుకునే ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశ్‌లో భాగమంటూ ‘ఆర్ట్ ఆఫ్ ట్రి యంప్’ అనే పుస్తకంలో చిత్రీకరించారు. పైగా భారత భూభాగాన్ని బంగ్లాదేశ్‌కు చెందినదిగా ఉన్న చూపిస్తూ ఉన్న వివాదాస్పద మ్యాప్‌ను పాకిస్థాన్ జనరల్ షంషాద్ మీర్జాకు బహుకరించడం చర్చనీయాంశంగా మా రింది. అయితే యూనస్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదేమీ తొలిసారి కాదు.

ఈ ఏడాది చైనా పర్యటనకు వెళ్లినప్పుడు మహమ్మద్ యూనస్.. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలు తమ భూభాగానికి చెందినవని పేర్కొన్నా రు. భారత ఈశాన్య రాష్ట్రాలను ‘సెవెన్ సిస్టర్స్’ అంటారని, వారు సముద్రానికి చేరుకోవడానికి వేరే మార్గం లేదని, ఈ ప్రాంతానికి తామే సం రక్షకులమని ప్రేలాపనలు చేశారు. ఇక చైనాతో ఆర్థిక బేస్‌ను పెంచుకోవడానికి ఇది మంచి అవకాశమంటూ భారత్‌ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు.

అయితే దీనిపై భారత్ అప్పట్లోనే ధీటుగా బదులిచ్చింది. బంగాళాఖాతంలో భారత్‌కు 6,500 కిమీ మేర పొడవైన తీరం ఉందని గుర్తు చే సింది. ఐదు బిమ్‌స్టెక్ దేశాలతో సరిహద్దును కలిగి ఉన్నామని, ఈశాన్య ప్రాంతమంతా బిమ్‌స్టెక్ కనెక్టివిటీ హబ్‌గా వృద్ధి చెందుతోందని చురకలు అంటించింది. ఇక బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత తాత్కాలిక ప్రధానిగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే భారత్‌తో సంబంధాలు క్షీణిస్తూ వస్తున్నాయి.

నిజానికి బంగ్లాదేశ్ కు స్వాతంత్య్రం రావడంలో భారత్‌దే కీలకపాత్ర. 1971లో అప్పటి తూర్పు పాకిస్థాన్ (ఇప్పటి బంగ్లాదేశ్)కు యుద్ధంలో భారత్ అండగా నిలిచింది. ఆ తర్వాత గత యాభై ఏళ్లుగా భారత్‌తో బంగ్లాదేశ్ స్నేహంగానే మెలుగు తూ వచ్చింది. అయితే యూనస్ బాధ్యతలు చేపట్టాకా పరిస్థితులు పూ ర్తిగా మారిపోయాయి. బంగ్లాదేశ్, పాకిస్థాన్ మధ్య స్నేహబంధం చిగురిస్తుంది. ఇటీవలే బంగ్లాదేశ్ సైన్యానికి పాక్ ట్రైనింగ్ ఇచ్చే విషయంపైనా ఒప్పందం జరిగింది.

మరోవైపు మహమ్మద్ యూనస్ అధికారం చేపట్టినప్పటి నుంచే బంగ్లాదేశ్‌లో వరుస వివాదాలు చోటుచేసుకున్నాయి. మత ఛాందసవాదులు కత్తులతో రోడ్లపైకి వచ్చి ముస్లిం మహిళలు బు రఖా ధరించాలని హుకుం జారీ చేయడమే గాక, వారి ఆదేశాలను బేఖాతరు చేసిన వారిని నడిరోడ్డుపై దండించారు. మైనారిటీలైన హిందువులపై దాడులు, దౌర్జన్యం చేస్తుంటే యూనస్ తనకేం పట్టనట్లుగా ప్రేక్షకపాత్రే వ హించారు.

బంగ్లాదేశ్‌లో ఎవరు అధికారంలోకి వచ్చినా తొలి విదేశీ పర్యటనగా ఢిల్లీకి రావడం సంప్రదాయం. అయితే యూనస్ దీనికి బ్రేక్‌నిస్తూ ఆయన చైనాకు వెళ్లారు. చైనాతో దోస్తీ కట్టిన యూనస్ భారత్ భద్రతకు ముప్పు తెచ్చే ప్రాజెక్టులను చైనాకు అప్పగించారు. బంగ్లాదేశ్‌లో రెండో అతిపెద్ద నౌకాశ్రయమైన మోంగ్లా ఆధునికీకరణ పనులను చైనాకు కట్టబెట్టారు.

భారత్ భద్రతను తీవ్రంగా ప్రభావితం చేసే తీస్తా నది ప్రా జెక్టులోనూ బీజింగ్‌కు భాగస్వామ్యం కల్పించారు. నడిమంత్రపు సిరిలా వచ్చి పడ్డ అధికారంతో మహమ్మద్ యూనస్ ఎన్నోసార్లు ఆపన్నహస్తం అందించిన భారత్‌తో కయ్యం పెంచుకొని బంగ్లాదేశ్ భవితవ్యాన్ని ఇరకాటంలో పెడుతున్నారేమోననిపిస్తుంది.