26-11-2025 12:21:08 AM
సర్పంచి ’సై’ .. వార్డు సభ్యుడు ‘నై’ ..
ఇల్లెందు/టేకులపల్లి, నవంబర్ 25, (విజయక్రాంతి): గ్రామ పంచాయితీ తరుణం ముంచుకొస్తుంది. గ్రామపరిపాలన చేసేందుకు ఉవ్విళ్లూరు తున్నారు. సర్పంచిగా నేనంటే.. నేనంటూ.. ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు. ఆశావాహులు ఎవరిని మం దలించినా సర్పంచి అభ్యర్థిగా బరిలో దిగుతామని, వార్డు సభ్యుడైతే నాకెందుకంటూ ఈసడించు కుంటున్నారు. ఆయా రాజ కీ య పార్టీల అదినాయ కులు బుజ్జగింపులు చేస్తూ ఒకరిని ఒప్పించి, మరొకరిని అభ్యర్థిగా నిలిపేందుకు కనరత్తు చేస్తున్నారు. ఇల్లెందు మండలంలో 29. పంచాయతీలు, టేకులపల్లి మండలంలో 36 పంచాయతీలు ఉన్నాయి.
ముఖ్యంగా అధికార కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల నుంచి పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. నాకు సర్పంచి పదవికి పోటీ అవకాశం ఇస్తే ఎంతైనా ఖర్చు చేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో పంచాయతీలో ఒక్కో పార్టీ నుంచి ఐదారుగురు వ్య క్తులు పోటీ పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో అన్ని పార్టీల నాయకులు, గ్రామస్తులు సమావేశాలై ఈసారి మన గ్రామానికి ఏ పార్టీ నుంచైనా సర్పంచి అభ్యర్థిగా పోటీకి అవకాశం ఇస్తే మిగతా సభ్యులు పోటీ నుంచి త ప్పుకొనే ఒప్పందాలు. చేసుకుంటున్నారు. నోటిఫికేషన్ సమయం దగ్గర పడుతున్నా కొద్దీ ఆశావాహుల్లో ఆందోళన పెరుగుతుంది.
పోటీ అభ్యర్థులు ఎక్కువ ఉన్న చోట ఈ ఒక్కసారి వార్డు సభ్యునిగా పోటీ చేయడం టూ బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నా, సర్పం చి అభ్యర్థిగా పోటీకి నిర్ణయించుకున్న వారు ససేమిరా అంటున్నారు. వార్డు సభ్యుడా.. పోటీ చేసి ఏమి చేయాలి. గెలిచినా సమావేశాలకే పరిమితం కదా అంటూ వ్యాఖ్యాని స్తున్నారు. ఈసారి కూడా ఉపసర్పంచి వదవికి కూడా చెక్ ఫవర్ జాయింట్ పెట్టడంతో ఆ పదవి పై మక్కువ చూపుతూ కొందరు వార్డు సభ్యులకు కూడా సై అంటున్నారు. అది కూడా తనకు ఉప సర్పంచి పదవి ఇస్తేనే పోటీలో ఉంటానని మొగ్గు చూపుతున్నారు.
కొన్ని పంచాయతీల్లో గిరిజనేతరులు ఎక్కువగా ఉండటంతో ఎక్కువ వార్డులు జనరల్కు కేటాయింపు జరిగాయి. కేటాయించిన వాటిలో సగం మహిళలకు రిజర్వు కాగా, మిగతావి జనరల్గా ఉన్నాయి. జనరల్గా ఉన్న వార్డుల్లో కొందరు వ్యాపారులు, ఇతరత్రా వ్యాపకాలు ఉన్న వారంతా వార్డు లో గెలిచి ఉప సర్పంచి పదవిని దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వారంతా ఇప్పటి నుంచి ఆయా వార్డుల్లో ఒకటికి రెం డు మార్లు ఓటర్లను కలిసి మన వార్డులో నిలబడుతున్నా అంటూ ఆప్యాయతను ప్రదర్శిస్తున్నారు. ఈ రెండు మండలాల్లో ఎన్ని కల సంఘం ప్రకటించే ఏ విడతలో ఎన్నికలు ఉంటాయో అని ఎదురు చూస్తున్నారు.
అభ్యర్థుల ఎంపికకై నాయకులు ఇప్పటినుంచే కసరత్తు చేస్తున్నారు. అధికార కాం గ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక అడుగు ముందులోనే ఉందని చెప్పొచ్చు. ఎమ్మెల్యే కోరం కనకయ్య పార్టీ ముఖ్య నాయకులతో విడతలవారీగా సమావేశాలు జరుపుతున్నారు. నోటిఫికేషన్ రావడమే తరువాయిగా అభ్యర్థులను సిద్ధం చేస్తున్నారు.