calender_icon.png 9 August, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చదువుతూనే సమాజ అభివృద్ధి చెందుతుంది

08-08-2025 11:20:26 PM

జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే..

బిచ్కుంద (విజయక్రాంతి): చదువుతూనే సమాజం అభివృద్ధి చెందుతుందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే(Former MLA Hanmanth Shinde) అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా తెలంగాణ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు పిహెచ్డి పట్టా పొందిన సందర్భంగా వారిని సన్మానించారు. కామారెడ్డి జిల్లా తెలంగాణ యూనివర్సిటీలో అర్థశాస్త్రంలొ పిహెచ్డి పూర్తి చేసి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ఇటీవల డిగ్రీ పట్టాను పొందారు. జుక్కల్ నియోజకవర్గ యువకులు డాక్టర్. దేవిదాస్ సక్పాల్ ధన్నూర్, డాక్టర్. దానేవార్ గంగాధర్, అంతపూర్ లను మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే సన్మానించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో చదివిన యువకులు చదువుకు పేదరికం అడ్డు రాదని నిరూపించారని కొనియాడారు. చదువుతోనే సమాజం మార్పు చెందుతుందని మరో మారు నిజం చేశారన్నారు. గ్రామీణ ప్రాంతంలో పుట్టి ఉన్నత విద్యావంతులవ్వడం నియోజకవర్గానికి గర్వకారణం అని విద్య వ్యాప్తి కోసం కృషి చేయాలనీ సూచించారు. అనంతరం వారిని పూలమాలతో శాలువాలతో సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు అవార్ శ్రీనివాస్, బిచ్కుంద సోసైటీ వైస్ చైర్మన్ యాదరావు, మాజీ మార్కెట్ చైర్మన్ నల్చర్ రాజు, మల్లికార్జున్ పటేల్, మాజీ సర్పంచ్ మారుతీ పటేల్, బస్వారాజ్ పటేల్, కో- అప్సన్ మెంబర్ మాజీ జావీద్, మాజీ ఎండోమెంట్ చైర్మన్ బొమ్మల లక్ష్మణ్, డాక్టర్ రాజు, చింతల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.