08-08-2025 11:18:12 PM
మందమర్రి (విజయక్రాంతి): ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో రక్షాబంధన్(Raksha Bandhan) వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంగడి బజార్ శివకేశవ ఆలయంలో శుక్రవారం రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని ముందస్తుగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు మాట్లాడుతూ అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్లు ప్రేమానురాగాలతో జరుపుకునే పండగ రక్షాబంధన్ అని అన్నారు. సోదర భావాన్ని పెంపొందించే రక్షాబంధన్ వేడుకలలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వారు కోరారు. అనంతరం ఇంటింటికి రక్షాబంధన్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ధర్మజాగరణ ప్రముఖ పైడిమల్ల అరుణ్ కుమార్, సభ్యులు రామటెంకి దుర్గ రాజు, బొద్దున ఓం ప్రకాష్, అడ్డూరి సాంబ మూర్తి, అనవేణి శంకర్, పోగుల రమేష్, ఐలయ్య లు పాల్గొన్నారు.