calender_icon.png 12 May, 2025 | 1:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తతరం కథలో జతగా

27-03-2025 12:00:00 AM

కోలీవుడ్ యువ హీరో ప్రదీప్ రంగనాథన్ తమిళ నాటే కాకుండా తెలుగులోనూ పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు నేరుగా టాలీవుడ్ కేంద్రం గా పనిచేస్తున్న పాన్ -ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఓ ద్విభాషా చిత్రాన్ని ప్రకటించింది. ‘పీఆర్4’ అనే మేకింగ్ టైటిల్‌తో ఈ సినిమా -తెలుగు, తమిళ భాషల్లో రానుంది. గతంలో పలు ప్రాజెక్టులకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన కీర్తిశ్వరన్ ఈ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయం కానున్నాడు.

ఈ ప్రాజెక్టు బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ సైతం కొనసాగుతోంది. మేకర్స్ సోషల్ మీడియాలో పంచుకు న్న ముహూర్తపు వేడుకలోని ఫస్ట్ విజువల్స్‌ను బట్టి ఈ కథ ఒక ఇంటెన్స్‌లో ప్రారంభమై, ఫన్ ఫుల్ కిస్‌తో ముగుస్తుందని తెలుస్తోంది.

ఇది కొత్తతరం కథాం శంతో కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని అర్థమవుతోం ది. ఇందులో ‘ప్రేమలు’ భామ మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నా రు. ఇంకా హృదుహరూన్, ద్రవిడ్ సెల్వం ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి అభ్యాంకర్ మ్యూజిక్ అందిస్తుండగా, నికేత్ బొమ్మి సినిమా టోగ్రఫీని నిర్వహిస్తున్నారు.