calender_icon.png 11 May, 2025 | 8:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెట్టింపు వినోదం పక్కా

27-03-2025 12:00:00 AM

‘మ్యాడ్’ సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది ‘మ్యాడ్ స్క్వేర్’. సంగీత్‌శోభ న్, నార్నే నితిన్, రామ్‌నితిన్, విష్ణు ఓఐ ప్రధాన పాత్రల్లో దర్శకుడు కల్యాణ్‌శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమా మార్చి 28న థియే టర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్ర మంలో హీరోలు నార్నే నితిన్, సంగీత్‌శోభన్, రామ్ నితిన్ మాట్లాడు తూ “ఏడాదిన్నర క్రితం మ్యాడ్ సినిమాతో మీ ముందుకు వచ్చాం. ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’తో వస్తున్నాం. ఈసారి వినోదం రెట్టింపు ఉం టుంది” అన్నారు.

చిత్ర సమర్పకుడు నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. ‘టికెట్ కొని థియేటర్‌కు వచ్చిన ప్రతి ఒక్కరూ తాము పెట్టిన ప్రతి రూపాయికీ న్యాయం జరిగిందని భావిస్తారు’ అన్నారు. చిత్ర నిర్మాత హారిక మాట్లాడుతూ.. ‘వారం నుంచి చూస్తున్నాను.. ట్రైలర్ ఇంకా రాలేదని అందరూ అడుగుతున్నారు. ఇప్పుడు చాలా స్ట్రాంగ్‌గా వచ్చామని నమ్ముతున్నా” అన్నారు.