05-05-2025 02:27:02 AM
హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): ప్రజలను మరోసారి మోసం చేయడానికి ఎమ్మెల్సీ కవిత కొత్త రాగం అందుకున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు రాని మాట లు.. అధికారం పోయాక చాలా పెద్ద మాట లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు.
‘ మీ నాయన సీఎంగా ఉన్నప్పుడు సామాజిక తెలంగాణ గుర్తుకు రాలేదా..? అధికారం పోయాక గుర్తుకువచ్చిందా? ఇప్పటికే రాహుల్‌గాంధీ నాయకత్వం లో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో సామాజిక ప్రజాపరిపాలన సాగుతోంది. స్వేచ్ఛగా గొంతువిప్పి మాట్లా డే హక్కును కాంగ్రెస్ ప్రభత్వం కల్పించింది. ఆ స్వేచ్ఛలోనే మీ గొంతు కూడా మాట్లాడుతుంది.
కొత్త కొత్త రాగాలు ఎంచుకుని నటించడం మీ కుటుంబానికే సాధ్యం. ఇందిరాపార్క్‌లో కూర్చొని మాట్లాడుతున్నారు అంటే అది కాంగ్రెస్ ఇచ్చిన స్వేచ్ఛ అనేది కవిత తెలుసుకోవాలి.’ అని అన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌ను నమ్మే పరిస్థితిలో లేరని, అందుకే కవిత కొత్త సిలబస్ తో మోసం చేయడానికి కొత్త ప్లాన్‌తో వస్తున్నారని మండిపడ్డారు.