05-05-2025 02:25:27 AM
కామారెడ్డి, మే 4 (విజయ క్రాంతి), కామారెడ్డి ఎస్ పి.ఆర్ స్కూల్ విద్యార్థిని అరిచిత ను ఆదివారం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు. కామరెడ్డి కి చెందిన నిమ్మ ఆరిచితా రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించడం అభినందనీయమని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు.
అనంతరం పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ పి ఆర్ పాఠశాల సీఈవో కోమీరెడ్డి మారుతి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.