22-01-2026 01:42:27 AM
డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వల్లభనేని ప్రసాద్
ముషీరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి): ఎన్నికల ముందు కాంగ్రెస్ మెని ఫెస్టోలో పొందుపర్చిన చేయూత పించన్లు వృద్ధులకు రూ. 4 వేలు, దివ్యాంగులకు రూ. 6 వేలకు పెంచి ఇవ్వాలని డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వల్లభనేని ప్రసాద్, ప్రధాన కార్యదర్శి భారతి, ఉపాధ్యక్షుడు కాటమోని వెంకటేష్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని వారు హెచ్చరించారు.
ఈ మేరకు బుధవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్లో డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ తెలంగాణ రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో దివ్యాంంగుల సంఘం నాయకులు మహ్మద్ మున్నా, నర్సింహ టైగర్. పి వెం కటేశ్వర్లు, చంద్రశేఖర్ తోపాటు వందలాది మంది దివ్యాంగులు పాల్గొన్నారు.