22-01-2026 01:40:31 AM
మల్కాజిగిరి జోన్ అదనపు డీసీపీ ఎన్.వెంకటరమణ
కుషాయిగూడ, జనవరి 21, (విజయక్రాంతి): మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ కుషాయిగూడ జోన్ ఏసీపీ కార్యాలయంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజిగిరి అదనపు డీసీపీ ఎన్.వెంకట రమణ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రయాణాలు సాగించే ప్రజలు సురక్షితంగా ప్రయాణించి ఇంటికి తిరిగి వెళ్లాలనే ఉద్దేశ్యంతో అరైవ్ అలైవ్ అనే పది రోజుల కార్యక్రమాన్ని తీసుకుని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో పోలీసులు అవగాహన సదస్సులు, కార్యక్రమాలు ఏర్పాటు చేశామని మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ అదనపు డీసీపీ ఎన్.వెంకట రమణ తెలిపారు.
అరైవ్ అలైవ్ కార్యక్రమం అన్నివ ర్గాల ప్రజల్లోకి వెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కుషాయిగూడ ఏసీపీ వై. వెంకట్ రెడ్డి, కుషాయి గూడ సీఐ ఎల్.భాస్కర్ రెడ్డి, ఎస్‌ఐలు సుధాకర్ రెడ్డి, వెంకన్న, రామయ్య తదితరులు పాల్గొన్నారు.