calender_icon.png 22 January, 2026 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మాక్ డ్రిల్

22-01-2026 01:44:21 AM

విపత్తుల వేళ అప్రమత్తతే రక్షణ

శంషాబాద్, జనవరి 21 (విజయ క్రాంతి): ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు మరియు ఇతర విపత్తులు సంభవిం చినప్పుడు ప్రజలు మెలకువతో ఉండి ప్రాణనష్టాన్ని తగ్గించుకోవాలని ఎన్డీఆర్‌ఎఫ్ అధికారులు పిలుపునిచ్చారు. బుధవారం శంషాబాద్ విమానాశ్రయ ఆవరణలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం, మాక్ డ్రిల్ నిర్వహించారు.

క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న బాధితులను సురక్షితంగా బయటకు తీసుకురావడం, ప్రథమ చికిత్స అందించడం వంటి అంశాలపై ఎయిర్పోర్ట్ అధికారులకు మరియు సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీతతో పాటు జిల్లా అధికారులు, ఎన్డీఆర్‌ఎఫ్, టీజీ ఎస్డీఆర్‌ఎఫ్, డీడీఆర్‌ఎఫ్ సభ్యులు పాల్గొన్నారు. వీరితో పాటు ఆపద మిత్ర టీమ్, జిల్లా అగ్నిమాపక శాఖ, మెడికల్ టీమ్స్, పోలీస్ మరియు విమానాశ్రయ ఉన్నతాధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.