calender_icon.png 24 November, 2025 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ రాజ్యంలోనే పక్కా ఇల్లు

24-11-2025 12:00:00 AM

-మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం

-ఎనిమిది దంపతులకు వస్త్రాల పంపిణీ 

-ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాల్లో ఎమ్మెల్యే 

 గోపాలపేట, నవంబర్23: ప్రతి నిరుపేద కుటుంబంలో ఇల్లు లేని వారికి ఇందిరమ్మ రాజ్యంలోనే పక్కా ఇల్ల నిర్మా ణాలు జరుగుతున్నాయని వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా గోపాలపేట మండలంలోని రేవల్లి మండలంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెగా రెడ్డి మాట్లాడుతూ గత ఇందిరమ్మ రాజ్యంలో లోనే ఇల్లు లేని వారికి స్థలాలను మంజూరు చేసి ఇందిరమ్మ ఇళ్ళను నిర్మించారని అన్నారు.

గత ప్రభుత్వాలు మాత్రం డబల్ బెడ్ రూమ్ లంటూ గొప్పలు చెప్పి సింగిల్ రూములు కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో చెప్పిన మాటలు అమలు చేస్తూ మాట నిలబెట్టుకుంటుందని గర్వంగా చెప్పారు. ఇప్పుడు కూడా అదే ఇందిరమ్మ రాజ్యం లోనే ఇల్లు లేని వారికి ఇల్లు నిర్మించి ప్రారంభోత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తుందని అన్నారు.

గోపాలపేట మండలం చెన్నూరు గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు పూర్తిచేసిన లబ్ధిదారులు బిసి రెడ్డి కావలి రాజు సింగిరెడ్డి మాధవి హసీనా బేగం గీతావద్విద్య కేతావత్ గోపాల్ మూడవ మంగమ్మ బొందిలి సునీత ఇలా ఎనిమిది మందికి నూతన వస్త్రాలను ఎమ్మెల్యే మెగా రెడ్డి అందజేశారు.  రేవల్లి మండలం చీరిక పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి ఎమ్మెల్యే వెళ్లి నూతన దంపతులకు వస్త్రాలను అందజేశారు.  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వాడల పర్వతాలు మాజీ సర్పంచ్ శ్రీనివాసులు రాజ వర్ధన్ గౌడ్ ఎల్లయ్య అంబరు నాయక్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.