24-11-2025 12:00:00 AM
కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఎండీ డాక్టర్ భాస్కరరావు
కిమ్స్ కడల్స్ ఆధ్వర్యంలో ప్రీమెచ్యూరిటీ డే సంబరాలు
హైదరాబాద్, నవంబర్ 23(విజయక్రాంతి): నెలలు నిండక ముందే పుట్టే పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటే ఎలాంటి ఇబ్బందులూ ఉండవని, ఆ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వాళ్లు జీవితాంతం ఇబ్బంది పడాల్సి ఉం టుందని కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఎండీ డాక్టర్ భాస్కరరావు అన్నారు. ఇలా పుట్టే పిల్లలకు రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని, అయినా సరైన ఆస్పత్రిలో, పిల్లలకు తగిన చికిత్స లభించేచోట ప్రసవం అయితే ఆ పిల్లలు కూడా అం దరిలా సామాన్య జీవితం గడపగలరని తెలిపారు.
అందుకు ఆదివారం ఇక్కడకు వచ్చిన వందల మంది పిల్లలే సాక్ష్యమని చెప్పారు. కొండాపూర్‌లోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నగరంలోని సంధ్య కన్వెన్షన్ సెంట ర్‌లో జరిగిన ప్రీమెచ్యూరిటీ డే కార్యక్రమం లో సీఎండీ డాక్టర్ భాస్కరరావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇంతమందిని ఇక్కడ ఒకేసారి చూడడం ఎంతో ఆనందం గా ఉందని, వీళ్లంతా నెలలు నిండకముందే పుట్టినా ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తున్నారని తెలిపారు.
ఇక్కడున్న పిల్లల్లో చాలామంది పుట్టేసరికి 600-, 800 గ్రాము ల లోపు బరువున్నవారే. ఇప్పుడు చక్కగా ఆడుతూ పాడుతూ ఉన్నారు. అందువల్ల ప్రీటెర్మ్ బేబీల విషయంలో అపోహలు అక్కర్లేదు అని సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కర రావు తెలిపారు. కిమ్స్ కడల్స్ కొండాపూర్ నియోనాటాలజీ విభాగం క్లినికల్ డైరెక్టర్, ఎన్‌ఐసీయూ విభాగాధిపతి,
సీనియర్ కన్సల్టెంట్ నియోనాటాలజీ అండ్ పీడియాట్రిక్స్ డాక్టర్ అపర్ణ సీ మాట్లాడుతూ, ప్రతి ఎనిమిది మంది పిల్లల్లో ఒకరు నెలలు నిండక ముందే, అంటే 37 వారాల గర్భం పూర్తికాక ముందే పుడతారని అన్నారు. మొత్తం పుట్టే పిల్లల్లో 15% వరకు ఇలా పుడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యనిపుణులు, పీడియాట్రీషియన్లు, నర్సులు, లాక్టేషన్ కన్సల్టెంట్లు, ఫిజియోథెరపిస్టులు పాల్గొన్నారు.