05-05-2025 10:19:37 PM
మునిపల్లి: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మునిపల్లి మండలం బుదేరా చౌరస్తాలో సోమవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్(Munipalli SI Rajesh Nayak) తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుల్బర్గకు చెందిన విట్టల్ సింగ్(75) అనే వ్యక్తి ట్రాన్స్పోర్ట్ లారీ క్లీనర్ గా పనిచేసి జీవనం సాగిస్తున్నాడు. అయితే మునిపల్లి మండలం బుదేరా చౌరస్తాలో సమీపంలోని పాన్ షాప్ కొరకు కోసం రోడ్డు దాటుతుండగా జహీరాబాద్ నుండి హైదరాబాద్ వైపు వెళ్ళుచున్న గుర్తుతెలియని ఒక కారు యొక్క డ్రైవర్ తన కారును అతివేగంగా, ఆజాగ్రత్తగా నడిపి బలంగా ఢీకొట్టి పారిపోయాడు. ఈ రోడ్డు ప్రమాదంలో విట్టల్ సింగ్ రోడ్డుపై పడిపోగా మృతుడి తలకు బలమైన గాయం కాగా 108 అంబులెన్స్ సహాయంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు అక్కడ వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ అక్బర్ పటేల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజేష్ నాయక్ తెలిపారు.