calender_icon.png 6 May, 2025 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవసాయ బావిలో కాలం చెల్లిన మందులు

05-05-2025 10:15:47 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా తొర్రూరు అన్నారం రోడ్డులో అచ్యుతండా సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో కాలం చెల్లిన మందులను పడేశారు. సోమవారం ఉదయం వ్యవసాయ బావి యజమాని బావి వద్దకు చేరుకోగా బావిలో వేసిన మందులు కనిపించాయి. కాలం చెల్లిన మందులలో ఇంజక్షన్లు, సిరప్ బాటిల్లు, మందు గోళీలు ఉన్నాయని తెలిపారు. పశువులు పాదచారులు తాగే మంచినీటి బావిలో ఇలా పడి వేయడంతో నీరంతా విషపూరితంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యాధికారులు వెంటనే ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులైన మెడికల్ షాప్ యజమాని ఎవరో తెలుసుకొని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.