calender_icon.png 29 January, 2026 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీలో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న వ్యక్తికి సన్మానం

29-01-2026 12:24:11 AM

నాగిరెడ్డిపేట్, జనవరి 28 (విజయ క్రాంతి): ఢిల్లీలో జరిగిన 77 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మండలంలోని తాండూరు గ్రామానికి చెందిన కమ్మరి రాజు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి శ్రమ యోగి మందన్ యోజన పథకం కింద విశిష్ట అతిథిగా ఉమ్మడి నిజాంబాద్ జిల్లా నుండి ఏకైక వ్యక్తిగా ఎంపికైనారు. విజయవంతంగా ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలను పూర్తిచేసుకుని తిరిగి స్వగ్రామం తాండూర్కి వచ్చిన సందర్భంగా గ్రామ సర్పంచ్ భూమా యాదవ్ గౌడ్ ఉప సర్పంచ్ సన్నీ,గ్రామ యువకులు, శాలువలతో సన్మానించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ భూమా యాద గౌడ్ మాట్లాడుతూ.. తమ గ్రామానికి చెందిన కమ్మరి రాజు ప్రధానమంత్రి శ్రమ యోగి మందన్ యోజన పథకం కింద ఎంపిక కావడం పట్ల గ్రామం తరపున అందరం హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. తమ గ్రామం తాండూరు పేరు ఢిల్లీ వరకు వెళ్లడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సన్నీ, కార్యదర్శి తిరుపతి, ఫీల్ అసిస్టెంట్ శ్రీనివాస్, కారోబార్ విట్టల్ ఉన్నారు.