29-01-2026 12:24:08 AM
ముకరంపురా, జనవరి 28 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాలో మరోమారు కాంగ్రెస్ నేతల్లో విభేదాలు బహిర్గతమయ్యాయి. కరీంనగర్ ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అధ్యక్షతన బుధవారం కరీంనగర్ పార్లమెంట్ ముఖ్య నేతల సమావేశం మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సిరిసిల్ల డీసీసీ అధ్యక్షుడు సం గీతం శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశంలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా నేతలకు తుమ్మల దిశానిర్దేశం చేశారు. అయితే మునిసిపల్ ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న వారు మంత్రు ల ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకుని మొ దటి నుంచి పనిచేస్తున్న తమకు టికెట్లలో ప్రాధాన్యమివ్వాలని, బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన వారికి టికెట్ ఇస్తే గెలవరని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేత అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. వెలి చాల రాజేందర్‌రావు అందర్నీ కలుపుకొని పనిచేయడం లేదని అసహనాన్ని వ్యక్తం చేశారు. టికెట్లు తామే ఇస్తామని కొందరు చెప్పుకుంటున్నారని పరోక్షంగా రాజేందర్‌రావును ఉద్దేశించి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు.ఈ సమావేశంలో పార్టీలో లోపించిన సమన్వయం మరో మరో బహిర్గతం అయింది. సమావేశం చివరలో పాల్గొన్న ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు.