calender_icon.png 12 December, 2025 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెస్సీతో ఫోటో రూ.10 లక్షలు

11-12-2025 12:46:28 AM

హైదరాబాద్ టూర్‌కు భారీ ఏర్పాట్లు

హైదరాబాద్, డిసెంబర్ 10 : అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లైనోల్ మెస్సీ ఇండియా టూర్ కోసం సాకర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత్‌లోని నాలుగు నగరాల్లో మెస్సీ పర్యటించబోతున్నాడు. దీనిలో భాగంగా హైదరాబాద్‌కు కూడా ఈ సాకర్ స్టార్ వస్తున్నాడు. ఉప్పల్ స్టేడియం లో శనివారం సెలబ్రిటీ ఫ్లెండ్లీ ఎగ్జిబిషన్ మ్యా చ్‌లో మెస్సీ ఆడనున్నాడు.ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి టీమ్‌తో మెస్సీ తలపడతాడు.

షెడ్యూల్ ప్రకారం చూస్తే మ్యాచ్ చివరి 5 నిమిషాల్లో మాత్రమే మెస్సీ గ్రౌండ్‌లోకి అడుగుపె ట్టనున్నాడు. అనంతరం యువ ఆటగాళ్లకు నిర్వహించే ఫుట్‌బాల్ క్లినిక్‌లో పాల్గొంటాడు. తర్వాత మెస్సీని ముఖ్యమంత్రి రేవంత్ సత్కరించనున్నారు. ఈ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో మ్యూజికల్ కన్సర్ట్ కూడా నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే మెస్సీతో కలిసి 200 మంది అతని టీమ్ భాగ్యనగరానికి రానుంది.

ఇప్పటికే ఈ ఈవెంట్‌కు సంబంధించిన టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అయితే ఫలక్‌నామా ప్యాలెస్‌లో మెస్సీ అభిమానులతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలోనూ పాల్గొంటాడు. మెస్సీతో ఫోటో దిగాలనుకునే అభిమానులు రూ.10 లక్షలు చెల్లిస్తే ఫలక్‌నామా ప్యాలెస్ మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్‌కు పాస్ ఇస్తామని మెస్సీ టూర్ చీఫ్ ప్రమోటర్, అడ్వైజర్ పార్వతి రెడ్డి చెప్పారు.

ఈ ఈవెంట్ సక్సెస్‌లో ప్రతీ ఒక్కరూ భాగం కావాలని కోరారు. కాగా ఉప్పల్ స్టేడియం గేట్లను శనివారం 4 గంటలకు తెరుస్తారని వెల్లడించారు. మెస్సీతో పాటు మరో ఇద్దరు సాకర్ స్టార్స్ కూడా వస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. అలాగే మరికొందరు సెలబ్రిటీలు సైతం ఈ కార్యక్రమానికి హాజరవుతున్నామని, ఈవెంట్ క్రేజ్ కోసం వారి పేర్లు ఇప్పుడు వెల్లడించం లేదని తెలిపారు. కాగా మెస్సీ టూర్ సందర్భంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకోనున్న మెస్సీ దాదాపు 5 గంటల పాటు నగరంలో ఉంటాడు.