11-12-2025 12:45:08 AM
భారత్‌కు బ్రాంజ్ మెడల్
చెన్నై, డిసెంబర్ 10 : పురుషుల జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో భారత కుర్రాళ్లు సత్తా చాటారు. అద్భుతమైన ప్రదర్శనతో అర్జెంటీనాను నిలువరించి కాంస్యం పతకం దక్కించుకున్నారు. ఈ టోర్నీ సెమీఫైనల్లో పరాజయం పాలైన భారత జట్టు మూడో స్థానం కోసం అర్జెంటీనాను ఢీకొంది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో భారత్ 4 గోల్స్ తేడాతో అర్జెంటీనాపై గెలిచి కాంస్య పత కం కైవసం చేసుకుంది.
భారత జట్టులో అంకిత్ పాల్, మన్నీత్ సింగ్, శ్రదానంద్ తివారీ, అన్మోల్ ఎక్కా ఒక్కో గోల్ కొట్టా రు. అర్జెంటీనా తరపున నికోలస్, శాంటియాగో గోల్స్ చేశారు. అన్మోల్ ఎక్కాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది. కాగా ఈ టోర్నీ చరిత్రలో భారత్ మూడో స్థా నంలో నిలవడం ఇదే తొలిసారి. జూనియర్ హాకీ వర ల్డ్‌కప్‌లో భారత్ చివరిసారిగా 2016లో విజేతగా నిలిచింది. తర్వాత 2021, 2022 ఎడిషన్లలో నాలుగో స్థానంతోనే సరిపెట్టుకుంది.
ఈ సారి టైటిల్ ఫేవరెట్‌గా అడుగుపెట్టిన భారత యువ జట్టు సెమీస్‌లో జర్మనీపై పరాజయం పాలైంది. ఇదిలా ఉంటే జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో కాంస్యం సాధిం చిన భారత జట్టు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. ఒక్కో ప్లేయర్‌కు రూ.5 లక్షల రివార్డ్ అందించనుం ది. అలాగే సహాయక సిబ్బందిలోని ఒక్కొక్కరికీ రూ.2.5 లక్షల చొప్పున అందజేయనున్నట్టు తెలిపింది. కాగా ఈ సారి జూని యర్ హాకీ ప్రపంచకప్‌లో జర్మనీ విజేతగా నిలిచింది. ఫైనల్లో పెనాల్టీ షూటౌట్‌లో 3 స్కోరుతో విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది.