calender_icon.png 18 December, 2025 | 2:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముత్తవరపు సురేష్ కుమారి కుటుంబం హ్యాట్రిక్ విజయం

18-12-2025 12:26:14 AM

కాపుగల్లు గ్రామ ఉపసర్పంచ్ గా ముత్తవరపు సురేష్ కుమారి

కోదాడ, డిసెంబర్ 17: మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ముత్తవరపు సురేష్ కుమారి కుటుంబం మరోసారి ఘన విజయం సాధించారు. వరుసగా మూడోసారి ప్రజల మద్దతుతో హ్యాట్రిక్ విజయం నమోదు చేస్తూ 9వ వార్డు మెంబర్ స్థానాన్ని కైవసం చేసుకుని ఉపసర్పంచ్ గా ఎన్నికైనారు.

గత రెండు పర్యాయాలుగా ముత్తవరపు సురేష్ కుమారి కుమారుడు ముత్తవరపు మురళి వార్డు మెంబర్ గా గెలుపొందారు.గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడమే తమ లక్ష్యమని ముత్తవరపు సురేష్ కుమారి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజల తరఫున పోరాడతామని ఆమె పేర్కొన్నారు.

గతంలోనూ కుటుంబ సభ్యులు ప్రజాప్రతినిధులుగా పనిచేసి ప్రజల్లో మంచి పేరు సంపాదించారని గ్రామస్తులు వెల్లడించారు.ఈ విజయం కాంగ్రెస్ పార్టీకి గ్రామస్థాయిలో మరింత బలం చేకూర్చిందని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. ఫలితాలు వెలువడిన వెంటనే గ్రామంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులు, అభిమానులు ముత్తవరపు సురేష్ కుమారిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.