calender_icon.png 10 September, 2025 | 10:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లి పేరు మీద ఒక మొక్క..

10-09-2025 12:30:39 AM

ప్రభుత్వ ఉద్యోగుల వినూత్న హరితహారం 

సిద్ధిపేట కలెక్టరేట్, సెప్టెంబర్ 9: పర్యావరణ పరిరక్షణలో భాగంగా సిద్దిపేట జిల్లాలో మంగళవారం జిల్లా కలెక్టర్ కే.హైమావతి ఆలోచన మేరకు, ‘ఏక్ పేడ్ మా కే నామ్’ స్ఫూర్తితో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ తల్లి పేరు మీద ఒక మొక్కను నాటారు.జిల్లా వ్యాప్తంగా ఒకే రోజు 15 వేల మొక్కలునాటారు.వనమహోత్సవం ద్వారా ఇప్పటికే జిల్లాలో 22 లక్షల మొక్కలు నాటాం.

ఇప్పుడు తల్లి పేరు మీద ఉద్యోగులు మొక్కలు నాటడం ఒక వినూత్న ఆలోచన, మొక్కల సంరక్షణ బాధ్యతను ప్రతి ఉద్యోగి తీసుకోవాలని కలెక్టర్ హైమావతి అన్నారు. వనమహోత్సవ కార్యక్రమంలో జిల్లాలో 22.827 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం కాగా లక్ష్యానికి మించి 23.329 లక్షల మొక్కలు నాటి 103.79 శాతం సాధించి రాష్ట్ర స్థాయిలో సిద్దిపేట మొదటి స్థానంలో నిలిచిందన్నారు.

అదనపు కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ ఉద్యోగుల ఉత్సాహం ప్రజలకు కూడా స్ఫూర్తి కావాలి. ప్రతి ఒక్కరూ పచ్చదనం పెంపుదలకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ జయదేవ్ ఆర్యతో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.