26-12-2025 12:00:00 AM
గాంధారి, డిసెంబర్ 25 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర స్తాయి సీనియర్ కబడ్డీ పోటీలకు మండలంలోని గుడివెనక తండ కు చెందిన సుచరిత ఎంపిక అయినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. ఈ నెల 22 న కామారెడ్డి ఇందిరా గాంధీ క్రీడమైదనంలో జరిగిన ఎంపిక పోటీల్లో అద్భుతంగా రాణించిన ఆమెను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు,ఈ నెల 25 నుండి 28 వరకు కరీంనగర్ జిల్లాలోని అంబేద్కర్ క్రీడా మైదానంలో జరుగుతున్నా పోటీల్లో కామారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తుందని ఆయన తెలిపారు,
సుచరిత ప్రస్తుతం మేడ్చల్ జిల్లా చేగుంట క్రీడా పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఆమెకు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు బ్రహ్మరాజ్, రంగ వేంకటేశ్వర గౌడ్, ఎస్జీఫ్ కార్యదర్శి హీరాలాల్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ భాస్కర్ రెడ్డి, గుడివెనక తండ సర్పంచ్ రవి నాయక్, ఉప సర్పంచ్ సంతోష్ అభినందించారు.