calender_icon.png 26 December, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం జరిగితే ఊరుకోం

26-12-2025 12:00:00 AM

జీవో 252 వెంటనే రద్దు చేయాలి 27న చలో కలెక్టరేట్

నిజామాబాద్, డిసెంబర్ 25 (విజయ క్రాంతి): డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం చేస్తే ఏమాత్రం సహించేది లేదని తమకు అన్యా యం చేస్తే ఆందోళన బాట పడతామని డెస్క్ జర్నలిస్టులు ప్రభుత్వానికి హెచ్చరించారు. అక్రెడిటేషన్లలో కోత విధించేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 252ను వెంటనే రద్దు చేయాలని వారు  డిమాండ్ చేశారు. డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం చేస్తే మాత్రం సహించమని డెస్క్ జర్నలిస్టులు తమ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అక్రెడిటేషన్లలో కోత విధించేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 252ను వెంటనే రద్దు చేయాలని డెస్క్ జర్నలిస్టులు ముక్తాకంఠంతో డిమాండ్ చేశారు. డెస్క్ జర్నలిస్టులు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో  సమావేశం అయ్యి డెస్క్ జర్నలిస్టుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్న 252 జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలన్నారు.  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈ తీవ్రంగావారు వ్యతిరేకించారు. 

జీవో 252 ద్వారా డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. అక్రెడిటేషన్, మీడియా కార్డుల పేరుతో జర్నలిస్టులను విభజించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై నిరసన తెలిపేందుకు ఈ నెల 27న ఛలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించాలని వారు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి జర్నలిస్టులందరూ తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.

అడ్‌హక్ కమిటీ ఏర్పాటు

డెస్క్ జర్నలిస్టులకు చేసిన అన్యాయంపై పోరాటం చేసేందుకు అడ్‌హక్ కమిటీని ఏర్పాటు చేశారు. కన్వీనర్గా భీంరావు, కోకన్వీనర్లుగా నరేంద్ర స్వామి, సందీప్, అశోక్రెడ్డి, రాకేష్, శ్రీనివాస్ను ఎన్నుకున్నారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో తదుపరి కార్యచరణపై చర్చించారు. కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని డెస్క్ జర్నలిస్టులు పాల్గొన్నారు.