calender_icon.png 24 December, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశా వర్కర్ల ఆధ్వర్యంలో నిరసన

24-12-2025 01:19:42 AM

మేడ్చల్ అర్బన్,  డిసెంబర్ 23 (విజయక్రాంతి): ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మేడ్చల్ యు.పి.హెచ్.సి ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని సిఐటియు మేడ్చల్ మండల కార్యదర్శి ఎం నరేష్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్స్ కి ఇవ్వాల్సిన పెండింగ్ డబ్బులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అదేవిధంగా లెప్రసి ప్రస్తుత సర్వే డబ్బులు గతం నుండి పెండింగ్లో ఉన్న డబ్బులను ప్రభుత్వం ఇంకా బడ్జెట్ రిలీజ్ చేయలేదని బడ్జెట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో గ్యారెంటీ లేదని అందుకని పెండింగ్ లెప్రసి ఇతర బిల్లులను వెంటనే చెల్లించాలని ఫికస్డ్ వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని నరేష్ డిమాండ్ చేశారు.

అంతేకాకుండా ఈనెల డిసెంబర్ 25న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని డిసెంబర్ 29న కమిషనరేట్ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ నాయకులు వసంత. పద్మ. సునీత. సునంద. మమత. రాణి. లావణ్య. రాజమణి. మంజుల. తులసి. రాజకుమారి. యాదమ్మ తదితరులు పాల్గొన్నారు..