24-12-2025 01:20:03 AM
హైదరాబాద్, డిసెంబర్ 23(విజయక్రాంతి): జలాలు, పాలమూరు--రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ విషయంలో బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలు పూర్తిగా తప్పని, అబద్ధపు ప్రచారాలతో శని, దరిద్రం అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని అవమానపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు అన్నారు. తిమ్మిని బొమ్మిని చేసి కేంద్రానికి వ్యతిరేకంగా పోరా టం చేయాలన్న కేసీఆర్ మాటలు కేవలం రాజకీయ నాటకమని, వాస్తవాలు ప్రజల ముందుంచకుండాసెంటిమెంట్ రాజకీయం చేయడమే ఆయన ధ్యేయం అని పేర్కొన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగ ళవారం నిర్వహించిన మీడియా సమావేశం లో రామచందర్ రావు మాట్లాడుతూ కేసీఆర్ వ్యాఖ్యలు అవాస్తవం అన్నారు. డీపీ ఆర్‌పై కేంద్రం అడిగిన ప్రశ్నలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మొదలయ్యాయని, తెలంగాణలో ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఏమీ జరగలేదని పేర్కొన్నా రు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎక్కడా అన్యాయం చేయలేదు.. చేయదు.. అని స్పష్టం చేశారు.
తెలంగాణలో రెండు సంవత్సరాల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి చేస్తున్న ఓటీపీ రాజకీయాలు ఇక నడవని అన్నారు. పాలమూరు --రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేసీఆర్.. ఏవేవో కథలు చెప్ప డం మొదలుపెట్టారు. ఇన్నాళ్లూ తెల ంగాణ ప్రజల నోట్లో మన్ను కొట్టారు. అందుకే ప్రజలు కేసీఆర్‌కు వీఆర్‌ఎస్ (వలంటరీ రిటైర్మెంట్ స్కీమ్) ఇచ్చారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ ఓటుశాతం క్రమేణా పెరుగుతోందని పార్టీ రాష్ట్రచీఫ్ పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ వైఖరిని ఖండిస్తున్నాం అన్నారు. ప్రధాని ప్రారంభించిన పీఎం ఫసల్ బీమా యోజనను తెలంగాణ రైతులకు అందకు ం డా అడ్డుకున్నారన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణకు చేసిన అన్యాయాన్ని, అసలైన వాస్తవాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను ప్రతి జి ల్లాలో నిర్వహిస్తామని అయన తెలిపారు.