calender_icon.png 6 May, 2025 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఘట్టం

06-05-2025 12:54:16 AM

ఎదురుకాళ్ళతో కవలలు ఉన్న గర్భిణికి నార్మల్ డెలివరీ చేసిన వైద్య సిబ్బంది

భద్రాద్రి కొత్తగూడెం, మే5 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక అపూర్వ ఘట్టం చోటుచేసుకుంది. పాల్వంచ వైద్య సిబ్బంది ఎంతో నేర్పుతో ఎదురుకాళ్ళతో కవల పిల్లలు ఉన్న గర్భిణీకి నార్మల్ డెలివరీ చేసి తమ నైపుణ్యాన్ని చాటారు. ఇంటర్నేషనల్ మిడ్ వైఫరీ (మంత్రసాని) దినోత్సవం రోజున ఇంత క్లిష్టమైన డెలివరీ చేయ టం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని కా న్పు చేసిన మెడ్ వైఫ్ వేమూరు సుజాత సోమవారం మీడియా తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే, పా ల్వంచ మండలం రేపల్లెవాడకి చెందిన జూపల్లి పల్లవి అనే గర్భిణీ తన రెండవ కాన్పు కోసం పా ల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు పరీక్షించి కవల పిల్లలున్నారని చెప్పి తగు జాగ్రత్తలు తెలిపారు. అలాగే సుఖ ప్రసవం కోసం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో కొన్ని వ్యా యామాలు చేయించి శిక్షణ ఇచ్చారు. తరచుగా వైద్య సిబ్బంది చెప్పిన వ్యాయామాలు చేస్తూ, వారు ఇచ్చిన సూచనలు పాటించిన పల్లవికి సోమవారం ఉదయం నార్మల్ డెలివరీ ద్వారా ఇద్దరు పండంటి మగ బిడ్డలకు జన్మనిచ్చింది. తల్లి,ఇద్దరు మగ బిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఎదురుకాళ్ళతో కవలలు ఉన్న గర్భిణీ మహిళకు నార్మల్ డెలివరీ చేయడం చాలా కష్టతరం పైగా ప్రైవేటు ఆసుపత్రుల్లో అయితే ఆపరేషన్ తప్పనిసరి. హైదరాబాద్ వంటి నగరాల్లో కనీసం లక్షన్నర నుండి రెండు లక్షలు వరకు ఖర్చు అవుతుంది.

కానీ ముందు నుంచే వ్యాయామం చేయించి తగు సూచనలు ఇవ్వడం ద్వారా ఇటువంటి సుఖప్రసవం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో సాధ్యమైంది . వైద్య సిబ్బందినీ. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, డిసిహెచ్‌ఎస్ డాక్టర్ రవిబాబు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాంప్రసాద్, తదితరులు అభినందించారు. ఇదే స్ఫూర్తితో కోత లేకుండా నార్మల్ డెలివరీ ప్రోత్స హించడానికి గర్భిణీలకు వ్యాయామం మరియు సూచనలు చేయాలని వారు కోరారు.