calender_icon.png 22 May, 2025 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమ పథకాలు గిరిజన యువత సద్వినియోగం చేసుకోవాలి

06-05-2025 12:52:29 AM

ఐటీడీఏ పీవో రాహుల్ 

భద్రాచలం, మే 5 (విజయ క్రాంతి) ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు గిరిజన నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకొని స్వశక్తి తో కుటీర పరిశ్రమ నెలకొల్పుకొని వారి కుటుంబాన్ని పోషించుకోవడమే కాక పదిమందికి ఉపాధి కల్పించడం సంతోషకర మని, అలాగే మార్కెట్ పరంగా వెసులుబాటు కల్పించుకొని ఆర్థికంగా లాభాల బాటలో నడవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.సోమవారం తన చాంబర్లో దుమ్ము గూడెం మండలం అంజుబాక గ్రామానికి చెందిన శ్రీ ముత్యాలమ్మ యాష్ బ్రిక్స్ యూనిట్ సభ్యులకు ఐదు లక్షల రూపాయల చెక్కును అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులైన గిరిజన యువతి, యువకులు రూ 19.80 లక్షల సబ్సిడీతో రూ 33 లక్షల ఖర్చుతో నిర్మాణం చేపట్టిన శ్రీ ముత్యాలమ్మ యాష్ బ్రిక్స్ యూనిట్,గిరిజన యువతి యువకులకు ఉపాధి కల్పిస్తున్న అన్నారు. యూనిట్ కాస్ట్, ఇటుకల తయారీ, మార్కెటింగ్ సౌకర్యం గు రించి యూనిట్ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జేడీఎం హరికృష్ణ, యూ నిట్ సభ్యులు ఉబ్బా కమలమ్మ, భద్రమ్మ, తిరుపతమ్మ, కార్తీక్, సాంబయ్య పాల్గొన్నారు.