06-05-2025 12:56:03 AM
భద్రాద్రి కొత్తగూడెం మే 5 (విజయక్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో మావోయిస్టు నక్సలైట్ల మనం బెదిరిస్తూ జనార్ధనకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను గుండాల పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఇల్లందు డిఎస్పి చంద్రభాను విలేకరులకు వివరాలను వెల్లడించారు.
గుండాల ఎస్త్స్ర రవూఫ్ తమ సిబ్బందితో కలిసి సోమవారం పెట్రోలింగ్ కు చేస్తుండగా తురుబాక గ్రామం నందు రోడ్డుపై ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించగా వారిని అదుపులోకి తీసుకొని విచారించగా ఆళ్లపల్లి మండలం నడిమిగూడెం గ్రామానికి చెందిన పాయం రాజేందర్, గుండాల మండలం ఘనాపురం గ్రామానికి చెందిన కల్తీ పాపయ్య అను ఇద్దరు గతంలో ప్రజా ప్రతిఘటన దళంలో పని చేశారు.
కల్తీ పాపయ్య 2010 సంవత్సరంలో హత్యా ప్రయత్నం కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి పోయి వచ్చాడు,.పాయం రాజేందర్ గతంలో ప్రజా ప్రతిఘటన దళంలో పని చేసి ఆళ్లపల్లి పోలీస్ ఎదుట లొంగిపోయాడు. వీరిద్ద రూ జల్సాలకు అలవాటుపడి ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే ఉదేశ్యంతో మావోయిస్టు పా zర్టీ పేరు చెప్పి గుండాల, ఆళ్లపల్లి మండలాల వ్యాపారస్తులను గత రెండు,మూడు నెలల నుండి ఫోన్లు చేసి పార్టీ ఫండ్ కోసం డబ్బులు కావాలని బెదిరిస్తున్నారు.
ఈ రోజు వీరిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీరి ఇరువురి నుండి 5000 రూపాయలు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు.నిషేధిత మావోయిస్టులది కాలం చెల్లిన సిద్దాంతాలని,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు ఉనికి అనేది లేదని ఇల్లందు డియస్పి తెలిపారు.
ఎవరైనా మావోయిస్టు ల పేరుతో ఫోన్లు చేసి బెదిరిస్తే ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురికా వద్దన్నారు. పోలీస్ వారికి పిర్యాదు చేయవలసిందిగా కోరారు. వీరిని పట్టుకోవటంలో కృషి చేసిన గుండాల సి.ఐ లోడిగ రవీందర్, యస్.ఐ సైదా రావూఫ్,కానిస్టేబుల్‌ను డియస్పి అభినందించినారు.